మొన్న.. సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వద్రా-డీఎల్ ఎఫ్ కుంభకోణం, నిన్న.. ట్రస్టు భూముల వ్యవహారంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ లను టార్గెట్ చేసిన సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారిపై ఆరోపణల ఆస్త్రం సంధించారు. మహారాష్ట్రలో ఇటీవల వెలుగుచూసిన సాగునీటి కుంభకోణంలో గడ్కరి పాత్ర ఉందంటూ బాంబు పేల్చారు. మాజీ ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో గడ్కరి కుమ్మక్కయ్యరాని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉంటూ మహారాష్ట్రలో తన సొంత వ్యాపార సామ్రాజాన్ని విస్తరించేందుకు గడ్కరీ ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. సమాచార హక్కు చట్టం కార్యకర్త అంజలి ధమనియా, మహారాష్ట్ర ఇరిగేషన్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారని, ఆమె ఈ కుంభకోణాన్ని గడ్కరి దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఆయన పట్టించుకోలేదని అన్నారు. మహారాష్ట్ర నుంచి క్విడ్ ప్రో కో పద్దతిన గడ్కరి లాభం పొందారని ఆరోపించారు.గడ్కరీకి అజిత్ పవార్ తో మంచి స్నేహం ఉందని, అందువల్లే నిబంధనలకు విరుద్ధంగా అవసరానికి మించిన రైతుల భూములను అజిత్ పవార్ గడ్కారికి కట్టబెట్టారని అన్నారు. గడ్కరికి 5విద్యుత్, 3చక్కెర పరిశ్రమలు ఉన్నాయన్నారు. డ్యాముల్లోని నీటిని తన పరిశ్రమలకు అక్రమంగా తరిలించిన గడ్కారీ విదర్భ రైతుల పొట్ట గొట్టారని చెప్పారు.
గడ్కరీ కుటుంబానికి చెందిన విద్యుత్ పరిశ్రమల కాలుష్యంపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.ఇవన్నీ చూస్తే కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్, బీజేపీలు స్నేహభావం ప్రదర్శిస్తున్నాయన్న అనుమానం కలుగుతోందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలను నితన్ గడ్కరి తిప్పికొట్టారు. మహారాష్ట్ర సాగునీటి కుంభకోణంలో తనకు ఎలాంటి పాత్ర లేదని వివరణ ఇచ్చారు. రైతుల నుంచి సేకరించినట్టు చెబుతున్న భూమిని తనకు 15ఏళ్ల లీజుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని అందులో రైతుల కోసం చెరకు మొక్కల నర్సరీ నడుపుతున్నట్టు చెప్పారు. తనకు షుగర్ కేన్ సొసైటీ ఉందని, అందులో 15వేల మంది చెరకు రైతులున్నారని తెలిపారు.సొసైటీ ఆస్తులు పది కోట్లని, ఇందులో సొసైటీకి లక్ష రూపాయల షేర్లు ఉన్నాయన్నారు. ఈ భూమిని కేవలం రైతుల ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తున్నామని వివరణ ఇచ్చారు. చెరకు సేద్యం అంటే కేవలం భూమి, నీళ్లు మత్రమే కాదని, మొక్కలు అందుబాటులో ఉండేలా చూడటం కూడా ముఖ్యమన్నారు. ఇక అవినీతికి తావెక్కడదని గడ్డరి ప్రశ్నించారు. మొత్తంమీద ఇంతవరకూ కాంగ్రెస్, యూపీఏ సర్కార్ అవకతలపై దృష్టి సారించిన కేజ్రీవాల్, తాజాగా ప్రతిపక్ష బీజేపీపై అందులోనూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిపై నేరుగా ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more